రుణమాఫీ 75 శాతం పూర్తి అయింది:పుల్ల..
రుణమాఫీ 75 ఐదు శాతం పూర్తి అయిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం విశేషంగా ఉంది. రైతుయాత్రలు చేస్తున్న రాహుల్, జగన్ లను రైతులు నమ్మబోరని ఆయన అన్నారు.తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు.అందువల్ల రైతు యాత్రలు చేసే అర్హత వారిద్దరికి లేదని పుల్లారావు అన్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించిన విషయాల ప్రకారం ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం అనుకున్నట్లుగా రుణమాపీకి ఇరవై రెండు వేల కోట్ల పైన అవసరం. అందులో ఏడు కోట్లు ఇంతవరకు ఖర్చు చేశారని ఒక అంచనా. ఆ ప్రకారం చూసినా మూడో వంతు మాత్రమే ఖర్చు చేసినట్లు. ఒకవేళ యాబై వేల రూపాయల చొప్పున రుణమాఫీ చేసినందున 75 శాతం మంది రైతులకు మేలు జరిగిందని మంత్రి చెప్పదలిచారో ఏమో తెలియదు కాని,రుణమాఫీ ఏకంగా డెబ్బై ఐదు శాతం పూర్తి అయిందని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంటుంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








